Monday, May 20, 2024

National | 14 లేదా 15న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్?

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 14 లేదా 15 తేదీల్లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తొంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించింది. సోమవారం నుంచి బుధవారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముగియగానే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు జమిలి అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. బుధవారం జమ్మూకశ్మీర్ పర్యటన ముగించుకుని ఎన్నికల సంఘం గురువారం లేదా శుక్రవారం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement