Monday, June 17, 2024

Business | 3 లక్షల కోట్ల సంపద ఆవిరి.. ఎలొన్ మస్క్ భారీ షాక్..

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కి భారీ షాక్ తగిలింది. టెస్లా షేర్ల విలువ క్షీణించడం ఎలోన్ మస్క్ ఆస్తిపై ప్రభావం చూపింది. ఈ ఏడాది ఇప్పటికే ఆయన సంపదలో రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింద‌ని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. ఫలితంగా ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలోన్ మస్క్ అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు.

ప్రస్తుతం ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ (201 బిలియన్ డాలర్లు), అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (198 బిలియన్ డాలర్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఎలాన్ మస్క్ (189 బిలియన్ డాలర్లు) మూడవ స్థానంలో ఉన్నారు. మస్క్ తరువాత మెటా హెడ్ మార్క్ జుకర్‌బర్గ్ 182 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement