Sunday, October 20, 2024

TS: ఆ కానిస్టేబుల్ కు రేవంత్ అభినంద‌న‌లు…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేష్‌ను ప్రశంసించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు వెళ్తున్న ఓ యువతిని కరెక్ట్‌ సమయంలో పరీక్షా కేంద్రానికి తరలించినందుకు సీఎం రేవంత్‌.. సురేష్‌ను అభినందించారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి.. వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్‌కు అభినందనలు.. సురేష్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.. ఆల్ ది బెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement