Friday, May 10, 2024

AP/TS | పాత రైళ్లు.. కొత్త స్టేషన్‌లు !

ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త. రాష్ట్రంలోని మరో నాలుగు రైల్వే స్టేషన్లలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. చాలా కాలంగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ పై స్పందించిన కేంద్ర రైల్వే శాఖ.. ఇప్పుడు సానుకూల నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని నాలుగు స్టేషన్‌లలో ఆగయన్న రైళ్ల వివరాలు..

రామేశ్వరం – భువనేశ్వర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ (20895/20896) రాజమండ్రిలో ఆగుతుంది.
హౌరా – పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు (12867/12868) రాజమండ్రిలో స్టాప్ ఇచ్చారు.
హుబ్లీ – మైసూరు హంపి ఎక్స్‌ప్రెస్ (16591/16592) అనంతపురంలో ఆగుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ – రేపల్లె ఎక్స్‌ప్రెస్ (17645/17646) రైలు సిరిపురంలో ఆగుతుంది.

తెలంగాణాలోనూ..

మరోవైపు తెలంగాణలో కూడా పలు రైళ్లకు 14 స్టేషన్లలో రైల్వే శాఖ అదనపు స్టాపేజ్‌ని ఏర్పాటు చేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో నడిచే రైళ్లకు తెలంగాణలోని 14 స్టేషన్లలో అదనపు స్టాప్‌లు ఇచ్చారు. వీటిలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 9 స్టేషన్లు ఉన్నాయి. తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17405/17406) మేడ్చల్‌లో.. నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (12787, 12788) రైళ్లు మహబూబాబాద్‌లో ఆగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement