Tuesday, May 14, 2024

Followup: పసికందు శరీరంలో మరో పిండం.. బిహార్‌లో వెలుగులోకి..

పసికందు శరీరంలో మరో పిండం పెరిగిన ఘటన బిహార్‌లో వెలుగులోకి వచ్చింది. 40రోజుల శిశువు బిడ్డ మూత్రం పోయడంలో ఇబ్బంది పడుతోందని, పొట్ట వద్ద ఉబ్బెత్తుగా ఉందని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు పరీక్షించి, అనుమానంతో సీటీస్కాన్‌ చేశారు. దీంతో చిన్నారి శరీరంలో పిండం ఉందన్న విషయం బయటపడింది. బిహార్‌ రాష్ట్రం మోతిహారి జిల్లాలో ఈఘటన చోటుచేసుకుంది. దీనిపై అక్కడి డాక్టర్‌ తబ్రీజ్‌ అజీజ్‌ మాట్లాడుతూ… ”వైద్య పరిభాషలో దీన్ని ‘ఫీటస్‌ ఇన్‌ ఫీటు’గా పిలుస్తారు.

శిశువు కడుపులో ఇంకో పిండం ఉండటం దీనర్థం. ఐదు లక్షల మందిలో ఒకరికే ఇలాంటి అరుదైన సమస్య వస్తుంది” అని వివరించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి శస్త్రచికిత్స చేసి, పిండం తొలగించామని డాక్టర్‌ అజీజ్‌ తెలిపారు. చిన్నారి ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement