Tuesday, May 18, 2021

టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

హైదరాబాద్ నగరంలోని అప్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ టైర్ల గోదాములో మంటలు ఎగిసిపడ్డాయి. సెంట్రల్ లైబ్రరీ వద్ద నిల్వ ఉంచిన టైర్లకు మంటలు అంటుకున్నాయి. పొగ దట్టంగా కమ్ముకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. దీంతో చాదర్ ఘాట్ – అఫ్జల్‌గంజ్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దట్టమైన పొగ అలుముకుంది. పక్కనే గుడిసెలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని స్థానికులు తెలిపారు. టైర్లు అంటుకున్న ప్రదేశం పూర్తిగా ఖాళీ స్థలం కావడం వల్ల ఎలాంటి అపాయం జరగలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమీపంలో ఉండే కొందరు పేదలు మాత్రం.. తమ గుడిసెలు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News