Monday, April 29, 2024

National : ఇంట్లో అగ్ని ప్ర‌మాదం… ఐదుగురు స‌జీవ‌ద‌హ‌నం…

యూపీలో ఓ ఇంట్లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మృతుల్లో ముగ్గురులున్నారు. అగ్ని ప్ర‌మాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. దానివల్లే మంటలు వ్యాపించి ఐదుగురు సజీవ దహనం అయ్యారని వెల్లడించారు.

- Advertisement -

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి లక్నోలోని ఓ ప్రాంతంలోని భవనం రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. అయితే షార్ట్ సర్క్యూట్ జరిగిన సమీపంలోనే రెండు సిలిండర్లు ఉండటంతో అవి పెద్ద ఎత్తున శబ్ధాలు చేస్తూ పేలాయి. దీంతో ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు మంటల్లో సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.’ అని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement