Thursday, May 2, 2024

ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య .. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ..

గచ్చిబౌలిలోని మై హోమ్ విహంగలో నివాసం ఉంటున్న శతాబ్ది (32) తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శతాబ్ది గదిలో నుంచి దుర్వాసన రావడం గమనించిన తోటి రూమ్మేట్స్ వెంటనే అపార్ట్మెంట్ సెక్యూరిటీకి సమాచారం అందించారు..గది తలుపులు ప‌గుల‌కొట్ట‌గా , చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని క‌నిపించింది.దాంతో వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. శతాబ్ది ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement