Monday, April 15, 2024

బ్రిటన్ లో అపర బకాసురుడు.. ఎంత తింటాడో తెలుసా .. !

లండన్-ఎంత భోజన ప్రియులైనా.. ఒకటో రెండో ముద్దలు ఎక్కువ తినొచ్చు. కానీ లండన్ లో ఓ భోజన ప్రియుడు ఏకంగా 9600 కేలరీల ఆహారాన్ని హాంఫట్ అంటూ ఆరగించి బ్రేవ్ మని తేన్చాడు. అదీ ఒకే సిట్టింగ్ లో ,,, కేవలం 24 నిమిషాల్లో లాగించేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. క్రిస్మస్ సందర్భంగా ప్రఖ్యాత మెక్ డొనాల్డ్ సంస్థ భోజనాల పోటీ పెట్టింది. ఎవరు ఎక్కువ శక్తిగల ఆహారాన్ని తింటే వారే విజేత అని చెప్పింది. కైలేగిబ్సన్ అనే భోజన ప్రియుడు ఈ పోటీకి హాజరయ్యాడు. ఇతనితోపాటు దేశవిదేశాలకు చెందిన వారు పదుల సంఖ్యలో ఓ పట్టుపట్టారు. కానీ ఈ గిబ్సన్ ముందు ఎవరూ నిలవలేకపోయారు.

తక్కువ సమయంలో ఎవరు ఎక్కువ శక్తిగల ఆహారాన్ని తింటారన్నది ఈ పోటీలో కీలకం. యూకే, యూఎస్ లలో ఇలాంటి పోటీలు క్రిస్మల్ వేళ నిర్వహిస్తూంటారు. గతంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 32వేల కేలరీల మాక్స్ తిని ఔరా అన్పించాడు. ఇప్పుడు గిబ్సన్ ఒకే సారి 9600 కేలరీల ఆహారాన్ని తినేసి ఔరా అన్పించాడు. ఇంతకీ అతడు తిన్న ఆహారంలో ఏమున్నాయో తెలుసా. ఎనిమిది ప్రత్యేక పైస్, ఆరు ప్రత్యేక బర్గర్లు, రెండు చీజ్ షేర్ బాక్సులు, రెండు ప్రత్యేక ఐస్ క్రీమ్ లు, స్వీట్లు ఉన్నాయి. ఓ ముక్క కూడా మిగల్చకుండా తినేసి ఇదే పెద్ద పోటీ కాదంటూ బ్రేవ్ మని తేన్చాడు గిబ్సన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement