Saturday, April 27, 2024

నెల్లూరు జిల్లాలో నకిలీ కోడిగుడ్ల కలకలం

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో నకిలీ కోడిగుడ్లు కలకలం సృష్టించాయి. మండల కేంద్రానికి సమీపంలోని ఆండ్రావారిపల్లెలో ఓ వ్యక్తి ఆటోలో కోడిగుడ్లను అమ్మకానికి తెచ్చాడు. 30 కోడిగుడ్లు రూ.130 అని చెప్పడంతో స్థానికులు కొనుగోలు చేశారు.

మార్కెట్‌లో 6 రూపాయల పైనే ఉన్న గుడ్డు 4 రూపాయల చిల్లరకు వస్తుండటంతో ప్రలు ఎగబడి కొన్నారు. అట్టలతో సహా గుడ్లను వినియోగదారులకు అందించాడు ఆ కల్తీ వ్యాపారి. దీంతో సంతోషంగా గుడ్లను ఇళ్లకు తీసుకెళ్లారు జనం. తీరా వాటిని ఉడకబెడితే అసలు విషయం బయటపడింది. అవి ఎంత సేపటికీ ఉడక్కపోవడంతో మోసపోయామని గ్రహించారు. గుడ్డుపై ఉన్న పెంకు ప్లాస్టిక్‌ పదార్థంగా ఉందని.. లోపలి తెల్లసొన కూడా తేడాగా ఉండటంతో అవి నకిలీ కోడుగుడ్లు అని చెబుతున్నారు. స్థానికంగా కలకలం రేపిన ఈ కోడిగుడ్లపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Advertisement

తాజా వార్తలు

Advertisement