Saturday, May 4, 2024

ఉస్మానియాలో నకిలీ డాక్టర్ అరెస్ట్..

ఉస్మానియా ఆస్పత్రిలో ఓ నకిలీ డాక్టర్ సంచారం కలకలం రేపుతోంది. అలీ అనే వ్యక్తి డాక్టర్ కోట్‌, మెడలో స్టెతస్కోప్ వేసుకొని దర్జాగా ఆసుపత్రి అత్యవసర విభాగం లో తోటి వైద్యులతో కలిసిపోయి కూర్చున్నాడు. అయితే… కొద్దీ సేపటి తర్వాత క్యాజ్‌వాలిటీ సీఎంఓ అతని ప్రవర్తన పై ఆరా తీసారు. పొంతన లేని సమాధానాలు చెపుతుందడంతో… ఇతడు నకిలీ వైద్యుడు గా గుర్తించారు. దీంతో అతన్ని పట్టకుని… వెంటనే స్థానిక అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు…. విచారణ చేసి… అలీని నకిలీ వైద్యుడిగా తేల్చారు. అనంతరం ఆ నిందితుని పై 170, 420, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అసలు ఎందుకు నకిలీ వైద్యుడి అవతారంలో వచ్చాడనే విషయం తెలవాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: డేంజర్ బెల్స్…ఇండియా లో కొత్తగా 46,164 కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement