Monday, April 29, 2024

కుటుంబంతో కలిసి సిమ్లా వెళ్లిన ఏపీ సీఎం జగన్

సీఎం హోదాలో పరిపాలన బాధ్యతలతో బిజీబిజీగా ఉండే జగన్ కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన కొంత సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపనున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ సిమ్లా టూర్​కు వెళ్లారు. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం తన ఫ్యామిలీతో కలిసి చండీగఢ్, అక్కడి నుంచి సిమ్లాకు బయలుదేరి వెళ్లారు.

వ్యక్తిగత అవసరాల నేపథ్యంలోనే సీఎం జగన్ సిమ్లాలో పర్యటించనున్నారు. సిమ్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. సీపీ బత్తిన శ్రీనివాస్, డీసీపీ హర్షవర్ధన్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. సీఎం జగన్​ వివాహం జరిగి ఆగస్టు 28కి సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా సీఎం తన కుటుంబసభ్యులతో కలిసి ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆగస్టు 26 నుంచి 31 వరకూ ఆయన కుటుంబంతో అక్కడే గడపనున్నారు. సెప్టెంబరు 1న ఆయన తిరిగి ఏపీకి రానున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఇక 11 రోజులే మిగిలాయి.. ఉరిశిక్ష ఎప్పుడు?

Advertisement

తాజా వార్తలు

Advertisement