Monday, May 6, 2024

కోహ్లీ తన అహాన్ని జేబులో పెట్టుకోవాలి: మాజీ క్రికెటర్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులోని తొలి ఇన్నింగ్సులో టీమిండియా ఘోర వైఫల్యం చెందింది. 78 పరుగులకే ఆలౌటై విమర్శలకు తావిచ్చింది. దీంతో మాజీ క్రికెటర్లు ఓ రేంజ్‌లో టీమిండియాపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీనే సాకుగా చూపిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లి ఏం చెప్పాడో అది అతడు చేసి చూపించాల‌ని మాజీ భారత క్రికెటర్ మణిందర్ సింగ్ హితవు పలికాడు. ఇత‌ర పిచ్‌ల‌పై డామినేట్ చేసిన‌ట్లుగా ఇంగ్లండ్ పిచ్‌ల‌పై చేయ‌కూడ‌దని మ‌ణింద‌ర్ అన్నాడు. కోహ్లీ మరింత సమయం క్రీజులో గడపాలని సూచించాడు.

2014 టూర్‌లో విఫలమైన తరహాలో కోహ్లీ ఆడుతున్నాడని, అతడు 2018 టూర్‌ను గుర్తుచేసుకోవాలని కోరాడు. అత‌డు త‌న శ‌రీరానికి చాలా దూరంగా వెళ్తున్న బంతుల‌ను ఆడుతున్నాడు. రెగ్యుల‌ర్ క్రికెట్ ఆడ‌క‌పోతే ఇలాంటివి జ‌రుగుతుంటాయి. 2014లో అత‌డు ఎలా ఔట‌య్యాడో ఈసారి కూడా అలాగే అవుతున్నాడు. బాల్ ఆడాలా లేదా వ‌దిలేయాలా అని ఆలోచించాలి. తొలి రెండు టెస్టుల్లో మ‌న బ్యాట్స్‌మెన్ ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బాల్స్‌ను వ‌దిలేశారు. కానీ ఈ మ్యాచ్‌లో మ‌ళ్లీ అది మ‌ర‌చిపోయి మూల్యం చెల్లించారు అని మ‌ణింద‌ర్ చెప్పాడు.

ఈ వార్త కూడా చదవండి: సెంచరీ లేకుండా 50 ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ

Advertisement

తాజా వార్తలు

Advertisement