Friday, April 26, 2024

రోప్ లేకుండా…ఫైట్స్ చేసిన సుధీర్ బాబు

కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఆనంది హీరోయిన్ తెరకెక్కుతున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది. అయితే ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ… గోదావరి జిల్లాలో గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇదని… గ్రామీణ వాసుల భావోద్వేగాలు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించనున్నామని అన్నారు. సోడా సెంటర్ శ్రీదేవితో సూరిబాబు ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలకు దారితీసింది… అనేదే ఈ సినిమా స్టోరీ అన్నారు.

ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలిపారు. రిస్క్ ఫైట్స్ ను డూప్ లేకుండా హీరో సుధీర్ బాబు చేశాడు. కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించేటప్పుడు కనీసం రోప్ కూడా వాడలేదని అన్నారు. ఆయన చేసిన ఈ ఫైట్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement