Friday, April 19, 2024

డేంజర్ బెల్స్…ఇండియా లో కొత్తగా 46,164 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 17,87,283 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 46,164 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 22.7 శాతం మేర పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3.25 కోట్లకు చేరాయి. నిన్న మరో 607 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 200మందికి పైగా మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 4,36,365 మంది మహమ్మారికి బలయ్యారు.

ఈ రోజు కూడా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే తక్కువగా ఉంది. తాజాగా 34,159 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.17 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.63 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు మళ్లీ ఒక శాతం దాటింది. ప్రస్తుతం 3,33,725 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement