Sunday, May 12, 2024

భారీ వర్షాల నేప‌థ్యంలో విద్యుత్‌ సిబ్బంది అందుబాటులో ఉండాలి : టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎండీ

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ సిబ్బంది, అధికారులు హెడ్‌ క్వార్టర్లల్లోనే ఉండాలని ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన 16 జిల్లాల్లోని సూపరింటెండెంట్‌ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరంగల్‌లోని విద్యుత్‌ భవన్‌ నుండిసీఎండీ ఇంజనీర్లతో మాట్లాడుతూ సంస్థ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సరఫరా, అంతరాయం తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్‌ వినియోగదారులకు ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించడానికి వరంగల్‌లోని కార్పొరేట్‌ కార్యాలయంతోపాటు అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో కం ట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్‌లు కేటాయించినట్లు గోపాల్‌రావు తెలిపారు. ఇప్పటివరకు వర్షాల కారణంగా 16 జిల్లాల్లో రెండు చోట్ల మాత్రమే అంతరాయం ఏర్పడినట్లు, సిబ్బంది యుద్దప్రాతిపదికన సరఫరా కల్పించడానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. అంతకుముందు ఆయన హనుమకొండ జిల్లా కలెక్టర్‌తో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో జరిగిన వీడి యో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement