Thursday, May 23, 2024

TS : హెచ్‌సీయూ విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్

గత కొద్దిరోజులుగా నిత్యం ఎన్నికల ప్రచారంతో బిజీ బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్న ఆయన విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. ప్రొఫెషనల్ ఫుట్ బాల్ క్రీడాకారుడిగా గోల్ వేసేందుకు పరుగులు తీశారు.

- Advertisement -

ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండానే ఫుట్ బాల్ ఆడారు. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ యూనిట్, హెచ్‌సీయూ విద్యార్థులు ఫుట్ బాల్ ఆడారు. ఈ ఫుట్ బాల్ మ్యాచ్‌కి సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏంఏ ఫహీం, టీ.శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement