Sunday, April 28, 2024

Earthquake – అఫ్గ‌నిస్థాన్ లో భారీ భూకంపం…ఢిల్లీ. రాజ‌స్థాన్, క‌శ్మీర్ ల‌లో ప్ర‌కంప‌న‌లు ..

న్యూఢిల్లీ – ఆఫ్గనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభ‌వించింది.. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో న‌మోదైంది.. దీని ప్ర‌భావంతో ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాదిన పలుచోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది. ఈ భూకంపం వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు న‌ష్ట వివ‌రాలు తెలీయ‌రాలేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement