Sunday, May 12, 2024

ప్రతి సిగరేట్‌లో 600 విషపూరిత పదార్థాలు… కాల్చితే 7 వేల పైచిలుకు హానికర రసాయనాలు..

ప్రతి సిగరేట్‌లో దాదాపు 600 విషపూరిత పదార్థాలు ఉంటాయి. ఇక సిగరేట్‌ను కాల్చినపుడు 7వేల కంటే ఎక్కువ విషపూరిత రసాయనాలను విడుదలవుతాయి. వీటిలో కనీసం 69 రసాయనాలు క్యాన్సర్‌కు కారణమవుతు న్నాయి. దూమపానం మానేస్తిే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. సిగరేట్‌, పొగాకు ఉత్పత్తులను నమలడం మానేసిన 128 గంటల్లోపు రక్త ప్రసరణ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. 24 గంటల్లో నికోటిన్‌ శరీరం నుంచి వైదొలుగుతుంది. 48 గంటల్లో వాసన, రుచి శక్తి మెరుగవుతుంది. 78 గంటల్లో శ్వాసక్రియ వృద్ది చెందుతుంది. 9 నెలలలోపు దగ్గు 10 శాతం తగ్గిపోతుంది. 12 నెలల లోపు గుండె జబ్బుల ప్రమాదం 50 శాతం తగ్గిపోతుంది. 10 సంవత్సరాలలోపు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు 50 శాతం తొలగిపోతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement