Saturday, April 27, 2024

దేశీయంగా పుంజుకున్న విమానయానం

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య వేగంగా పుంజుకుంటోంది. గతేడాది కంటే 64శాతం పెరిగింది. సెప్టెంబర్‌ నాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 10.35 మిలియన్లకు చేరుకుంది. ఈ మేరకు ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) బుధవారం గణాంకాలు విడుదల చేసింది. భారతీయ దేశీయ క్యారియర్‌లు ఏడాది కిందట స్థానిక మార్గాల్లో 7.66 మిలియన్ల మందిని గమ్యస్థానాలకు తీసుకెళ్లాయని ఈ డేటా పేర్కొంది. ఆకాశ ఎయిర్‌ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశీయ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించింది. ఈ క్యారియర్‌ల సగటు ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ ఆగస్టు 2022లో డెలివరీ చేయబడిన 72.5 శాతం పీఎల్‌ఎఫ్‌తో పోలిస్తే 77.5శాతంగా ఉందని డీజీసీఏ డేటా చూపిస్తున్నది.

మార్కెట్‌ వాటా పరంగా ప్రముఖ క్యారియర్‌ ఇండిగో తన దేశీయ నెట్‌వర్క్‌లో 59.72 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఇది మొత్తం దేశీయ ఎయిర్‌ ట్రాఫిక్‌లో 57శాతాన్ని ఆక్రమించింది. 9.6శాతం మార్కెట్‌ వాటాతో తర్వాతి స్థానంలో విస్తారా ఉంది. విస్తారా, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఏషియా సంస్థల ఉమ్మడి పిఎల్‌ఏ ఫ్యాక్టర్‌ 24శాతంగా ఉంది. విస్తారాలో టాటా గ్రూప్‌ 49శాతం వాటాను కలిగివుండగా, ఎయిర్‌ ఏషియా ఇండియాలో 83.67 శాతం వాటాను కలిగివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement