Monday, April 29, 2024

హిందీలో కూడా దూసుకుపోతోన్న.. కాంతార

హిందీలో కూడా దూసుకుపోతోంది కాంతార చిత్రం. రిషబ్ శెట్టి తన చిన్నతనంలో తన గ్రామంలోని ఒక ఆచారం .. ఆ ఆచారంతో ముడిపడిన కొన్ని సంఘటనలతో ఒక కథను రెడీ చేసుకున్నాడు. ఆ కథనే ‘కాంతార’ సినిమాగా తెరపైకి తీసుకుని వచ్చాడు. రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా ఈ మూడు పాత్రలకి ఆయన న్యాయం చేశాడు. అందుకు వివిధ భాషల్లో ఈ సినిమా రాబడుతున్న వసూళ్లే నిదర్శనం. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, తెలుగులో ఈ నెల 15వ తేదీన గీతా ఆర్ట్స్ వారు విడుదల చేశారు. తెలుగుతో పాటే ఈ సినిమా హిందీలోను విడుదలైంది. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లనే రాబడుతోంది. ఇంతవరకూ అక్కడ ఈ సినిమా 13.10 కోట్లను వసూలు చేసింది. ఇంకా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. క్లైమాక్స్ లో అమ్మవారు ఆవహించి దుష్ట శిక్షణ చేయించే సన్నివేశంలో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement