Saturday, April 27, 2024

వెంకీ అట్లూరి పెళ్లి.. సంద‌డి చేసిన సెల‌బ్రిటీస్

ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ ఫుల్ కెరీర్ ని లీడ్ చేస్తోన్న వెంకీ అట్లూరి పెళ్లి పీట‌లెక్కాడు. ఆయ‌న పెళ్లికి హీరో నితిన్‌ తన సతీమణితో కలిసి వచ్చాడు. వీరితో పాటుగా హీరోయిన్‌ కీర్తిసురేష్‌, దర్శకుడు వెంకీ కుడుముల కూడా పెళ్లికి హాజరైయ్యారు. తాజాగా నితిన్‌ వీళ్లతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. అంతే కాదు ఫోటో షేర్ చేయడంతో పాటు.. ఓ నోట్ కూడా రాశాడు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు వెంకీ అట్లూరికి అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.స్నేహగీతం సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకీ అట్లూరి.

తొలి ప్రేమ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే మొస్తరు హిట్ సాధించిన ఈయంగ్ స్టార్.. వరుస సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్‌ మజ్ను, నితిన్‌తో రంగ్‌దే సినిమాలు తెరకెక్కించాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ప్రస్తుతం వెంకీ కి లక్కీ ఛాన్స్ దొరికింది. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సార్‌ టైటిల్ తో తెరకెక్కిస్తున ఈమూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో వెంకీ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందంటున్నారు సినీ జనాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement