Saturday, December 7, 2024

భీష్ముడి అంత్యదశ సేవలు

మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతి కరమైన మహాపర్వం. భీ ష్మ నిర్యాణానంతరం వ చ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని ‘భీష్మ ఏకా దశిగా” పేర్కొనబడింది.
”అంపశయ్యపై వున్న కురువృద్ధుడి వద్ద అపారమైన జ్ఞాన సంపద ఉందని, ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి ఆ జ్ఞానాన్ని తెలుసుకోమని వ్యాసుడు, కృష్ణుడు ధర్మ రాజుకు సలహా ఇస్తారు. వారి సలహావల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. అందులో భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు. విష్ణుసహస్ర నామం కూడా అందులోదే.
భీష్ములవారు క్రింద పడగానే వేలాది కన్యలు వచ్చి ఆ ప్రదేశా న్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలు చల్లి, పూవులతో అలంకరిం చారు. భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు.
”తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకా:!
శిల్పినశ్చ తథా జగ్ము: కురువృద్ధం పితామహం!!
భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలు వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు వచ్చా రని వ్యాసుడు చెప్పాడు. అంత్య కాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడానికి నటులు, నర్తకు లు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. ఇక్కడ అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతే కానీ వారు ఎవ రు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్ప లేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడనయ్యాను అన్నందున. ”భీష్ముడి మరణశయ్య దగ్గరకు ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమ హంసలు, దేవతలువచ్చారు. వారిలో నారదాది సంగీత విద్వాంసులు ఉన్నారు. శ్రీకృష్ణుడు వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే వ్యాస మహ ర్షితో కూడిన సమస్త రుషి గణాలూ రుగ్‌, యజుస్‌, సామగానాలు చేశారు. అన్ని రుతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో కురిశాయి. దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభ వించాయి. భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటుచేసిన శ్రీకృష్ణుడు. ఈ ప్రతి వర్ణన అంత్యదశ సేవల్లో చాలా ముఖ్యమైనదే!
– శ్రీధర్‌ వాడవల్లి

Advertisement

తాజా వార్తలు

Advertisement