Tuesday, May 14, 2024

HYD: డిజిటల్ ఇండియా ప్రైవేట్ కంపెనీ భారీ మోసం.. రూ.30కోట్లతో పరార్..

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మోసానికి పాల్పడింది. ఆన్ లైన్ జాబ్, వర్క్ ఫ్రం హోమ్, యూఎస్ బేస్డ్ కంపెనీ అంటూ చీటింగ్ కు పాల్పడ్డారు. నెలకు రూ.3లక్షల పైనే జీతం అంటూ ఫోన్ కాల్స్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడ్డారు. రూ.5.5లక్షల డిపాజిట్ చేస్తే ఆరు నెలల్లో తిరిగి ఇస్తామని ప్రకటనలు గుప్పించారు. ఈవిధంగా డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. 700 మంది నుంచి రూ.30కోట్ల మేర డిపాజిట్లు కట్టించుకుని కంపెనీ ప్రతినిధులు పారిపోయారు. డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అమిత్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement