Wednesday, May 8, 2024

Deepotsav | సీతాదేవి పుట్టింట్లో ఘనంగా దీపోత్సవం..

అయోధ్య రామ మందిరంలో ఇవ్వాల అంగరంగవైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నేపాల్‌లోని సీతాదేవి పుట్టినిళ్లయిన జనక్‌పూర్‌లో కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జనక్‌పూర్‌లోని సీతారామాలయంలో ఉత్సవాలు నిర్వహించారు. దీంతో రోజంతా ఆలయంలో సందడి నెలకొంది. ఇక చీకటి పడగానే ఆలయంలో దీపోత్సవం నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement