Monday, May 13, 2024

రావణాసుర బిగ్ అప్ డేట్ ఆన్ దీపావళి

మాస్ మహరాజ్ రవితేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమా నుండి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. దీపావళి కానుకగా అంటే రేపు ఉదయం 10.08 గంటలకు ఓ అప్డేట్‌ ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది. తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమౌతుంది.హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement