Monday, May 6, 2024

ISRO: కౌంట్ డౌన్ .. నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ58

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2024 నూతన సంవత్సరం మొదటి రోజే పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమై 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ -సీ58 వాహక నౌక షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.

మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈసారి ఎక్స్-రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లు. ఈమారు ఎక్స్‌పోశాట్ ఉపగ్రహంతో పాటూ మరో పది ఇతర పేలోడ్‌లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement