Friday, May 3, 2024

Closed: నూత‌న సంవ‌త్స‌ర స్వాగ‌త వేళ‌… ఫ్లైఓవ‌ర్లు బంద్‌

నూత‌న సంవ‌త్స‌రాల వేడుక‌ల సంద‌ర్భంగా ఇవాళ హైద‌రాబాద్‌లో ప‌లు ఫ్లైఓవ‌ర్లు మూసివేయ‌నున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలను ఇన్సిడెంట్‌ ఫ్రీ గా జరుపుకొనే విధంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్రై కమిషనరేట్‌ సీపీలు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల్లో కచ్చితంగా నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డిసెంబర్‌ 31న రాత్రి 11 గంటల నుంచి జనవరి-1 ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌ను మూసి వేస్తున్నట్లు వెల్లడించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు టికెట్లు చూపిస్తే అనుమతిస్తారని సీపీ తెలిపారు. కామినేని, ఎల్‌బీనగర్‌ ఫ్లైఓవర్లు, ఎల్‌బీనగర్‌, చింతల్‌కుంట అండర్‌పా్‌సతో పాటు.. సాగర్‌ రింగ్‌రోడ్‌ ఫ్లైఓవర్‌ వన్‌సైడ్‌ (ఎల్‌బీనగర్‌ టు మందమల్లమ్మ) వరకు మూసి వేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement