Wednesday, May 8, 2024

వంటనూనెలు మరింత ప్రియం.!

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : గ్రేటర్‌ పరిధిలో పెరుగుతున్న వంటనూనెల ధరలతో సామాన్య, మధ్యవర్గాల ప్రజలు హడలి పోతున్నారు. ఇలా రేట్లు పెరిగితే రాబోయే రోజుల్లో కొనేదెలా.? అని చింతిస్తుండటం గమనార్హం. ఇకపై వంట నూనెకు దూరం కావాల్సిందే అనే భయం వెంటాడుతోంది. ధరల పెరుగుతున్న ఉక్రె యిన్‌ -రష్యా యుద్ధం, ఇతరత్రా అంతర్జాతీయ స్థాయి పరిణామాల కారణంగా నిలుస్తున్నప్పటికీ.. ఎక్కడ ఏది జరిగినా.. దాని ప్రభావం మాత్రం సామాన్యులపైనే పడుతోంది. అవకాశం ఉందనే చర్చ సాగిందంటే చాలు, వెంటనే బ్లాక్‌ మార్కెట్‌ దందా మేల్కొంటుంది. మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలకు షాక్‌ ఇస్తుండటం తెలిసిందే. దీంతోనే ప్రస్తుతం సన్‌ఫ్ల వర్‌, పామాయిల్‌, వేరుశనగ నూనెలు ఎమ్మార్పీ ధరలు మండిపోతున్నాయి. మరోవైపు కేంద్రం ప్రభుత్వం సైతం పెరుగుతున్న వంటనూనెల ధరలకు బ్రేక్‌ వేసేందుకు దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది కావాలనే ధరలు పెంచి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని గుర్తించి, ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని అధికారులు చెబుతున్నప్పటికీ నేటీకి అమలుకు నోచుకోవడం లేదు.

సన్‌ఫ్లవర్‌, పామాయిల్‌కు తీవ్ర కొరత.!

ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా సన్‌ఫ్ల వర్‌ ఆయిల్‌ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఎగుమతి అవుతున్న సన్‌ఫ్ల వర్‌ ఆయిల్‌లో దాదాపు 80శాతం వరకు నల్లసముద్రం గుండా వెళుతోంది. అయితే రష్యా అడ్డంకిని సృష్టి స్తోంది. గత ఫిబ్రవరి నుంచి రష్యన్‌ సైన్యం ఉక్రెయిన్‌లో ఉంది. దీని కారణంగా ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రశ్రేణి పామాయిల్‌ ఉత్పత్తిదారు ఇండోనేసియా, దేశీయ కొరతను తగ్గించేందుకు ఎడిబుల్‌ ఆయిల్‌, దాని ముడి పదార్థాల ఎగుమతులపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. ఇండోనేషి యా తీసుకున్న ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగి ధరలు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం. ప్రపంచంలో అధికంగా పామాయిల్‌ ఆహారంకోసం వినియో గిస్తున్న దేశం భారత్‌. ఇండోనేషియా సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్రపరిణామాలు కలిగిస్తున్నాయి. ఇదిలావుంటే రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు మరింత ప్రియం కానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement