Tuesday, April 30, 2024

‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్ ఎప్పుడంటే..

నాగ‌శౌర్య లేటెస్ట్‌గా న‌టించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. షిర్లీ సేథియా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి అనీష్ ఆర్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్‌ కు మంత్రి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే 20న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతాన్ని అందించాడు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement