Saturday, April 27, 2024

మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ సస్పెన్షన్.. మహారాష్ర్ట ప్రభుత్వ నిర్ణయం..


ప్ర‌భ‌న్యూస్ : ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ ను మహారాష్ర్ట ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం అంటిలియా ఎదుట పేలుడు పదార్థాల స్వాధీనం, ధానే వ్యాపారవేత్త మన్ సుఖ్ హిరేన్ హత్య కేసుల్లో ఆయన వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

ఈ కేసుల్లో వంద కోట్ల రూపాయల ముడుపులు కోసం పరంబీర్ ఒత్తిళ్లు తీసుకువచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. కాగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడుతుందని చాలాకాలంగా అనుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాక్రే ఆస్పత్రినుంచి కోలుకుని వచ్చాక, బుధవారం ఫైల్ పై సంతకం చేశారు. దీంతో సస్పెషన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement