Saturday, April 27, 2024

లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ..

ప్ర‌భ‌న్యూస్: కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌కు సంబంధించిన ప్రతికూల రిపోర్టులు వెలువడినా… దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండవ రోజు గణనీయ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 776.50 పాయింట్లు లేదా 1.35 శాతం మేర లాభపడి 58,461.29 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 1400 పాయింట్ల మేర వృద్ధి చెందినట్టయింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గురువారం 234.75 పాయింట్లు లేదా1.37 శాతం మేర వృద్ధి చెందింది. భారీ లాభాల్లో ముగియడంతో గురువారం ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద వృద్ధి చెందింది. బీఎస్‌ఈ – లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3.28 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. కాగా బుధవారం రూ.2.19 లక్షల కోట్ల మేర పెరిగింది.

దీంతో వరుస రెండు రోజుల మదుపర్ల సంపద రూ.5.47 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. గురువారం భారత మార్కెట్ల అనిశ్చతి సూచీ వీఐఎక్స్‌ 7 శాతం మేర క్షీణించి 18 స్థాయికి పడిపోయింది. లాభపడిన పెద్ద కంపెనీల జాబితాలో అదానీ పోర్ట్‌ ్స 5.43 శాతంతో నిఫ్టీపై అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్‌, టాటా స్టీల్‌, ఇండియన్‌ ఆయిల్‌, టెక్‌ మహింద్రా ఇతర లాభదార్లుగా నిలిచాయి. నిఫ్టీపై సిప్లా అత్యధికంగా 0.79 శాతం నష్టపోయింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 0.61 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 1.14 శాతం లాభపడ్డాయి.

ఎన్‌ఎస్‌ఈపై నిఫ్టీ 500 సూచీ 1.28 శాతం మేర క్షీణించింది. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలపై మిడ్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలపై ధనీ సర్వీసెస్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఇమామీ సెంచురీ టెక్స్‌టైల్స్‌, సీడీఎస్‌ఎల్‌, ఎంసీఎక్స్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. 4-9 శాతం మధ్య లాభపడ్డాయి. కాస్ట్రోల్‌ ఇండస్ట్రీస్‌, ఫైజర్‌, అలెంబిక్‌ ఫార్మాష్యుటికల్స్‌, ట్రైడెంట్‌, కేపీఐటీ టెక్‌, సీఎస్‌బీ బ్యాంక్‌ బ్రాడర్‌ మార్కెట్‌ రంగంలోఎక్కువగా 1-5 శాతం మధ్య నష్టాలతో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 2.06 శాతం వృద్ధి చెందింది. నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సూచీలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement