Sunday, May 19, 2024

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671.45 కోట్లు జమ

ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకాన్ని సోమవారం నాడు సీఎం జగన్ ప్రారంభించారు. ఈ మేరకు జగనన్న విద్యా దీవెన పథకం ల‌బ్ధిదారుల ఖాతాల్లో ఒక్క క్లిక్‌తో నగ‌దు జ‌మ చేశారు. 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదు కింద అర్హులైన 10,88,439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ప‌డుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం గొప్ప కార్య‌క్ర‌మమ‌ని చెప్పారు. చ‌దువుతోనే జీవితాల రూపురేఖ‌లు మార‌తాయ‌ని తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువేన‌ని, పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉందని చెప్పారు. 2018-19 బకాయిలు రూ.1,800 కోట్లను కూడా త‌మ‌ ప్రభుత్వమే చెల్లించిందని గుర్తు చేశారు. 2019-20 ఏడాదికి పూర్తి రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించామ‌ని జగన్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement