Monday, May 6, 2024

జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం ….పేరేంట్స్ ఖాతాలోకి ఫీజు రీయింబర్స్‌మెంట్ న‌గ‌దు..

అమ‌రావ‌తి: జగనన్న విద్యా దీవెన పథకం కింద 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజురీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. అంతకు ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ‘చదువుతోనే మన జీవితాల రూపురేఖలు మారుతాయి. చదువుతోనే పేదరికం నుంచి బయటపడగలుగుతామని మనసా.. వాచా.. కర్మణా నమ్ముతున్నా. చదువు అనేది నా తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు ఇస్తున్న ఒక ఆస్తి అని గర్వంగా చెబుతున్నా’ అని అన్నారు. మూడేళ్ల్ల చిన్నారి నుంచి ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థి వరకు ప్రతి అడుగులోనూ ఆ పిల్లలకు తోడుగా ఉంటూ, అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆ కుటుంబంలో సభ్యుడిని అయ్యినందుకు సంతోషంగా ఉందన్నారు. రూ. 671 కోట్లతో అక్షరాల 9,79,445 మంది తల్లులకు దాదాపు 10.88 లక్షల మంది పిల్లలకు మేలు జరిగించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంతో పిల్లలకు, తల్లులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement