Sunday, May 12, 2024

SA vs AUS | ఆదుకున్న మిల్ల‌ర్… ఆసీస్ టార్గెట్ ఎంతంటే !

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇవ్వాల కోల్‌కతా వేదికగా రెండో సెమీఫైనల్ జరుగుతుండగా.. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డున్నాయి. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

ఇక, ఈ మ్యాచ్‌లో సఫారీలపై ఆసీస్ బౌల‌ర్లు చెల‌రేగారు.. 12 ఓవ‌ర్ల‌లో స్కోరు 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తరువాత వచ్చిన మిల్లర్‌ (101) – క్లాసెన్‌ (47) లు జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు కంగారూ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లతో సత్తా చాటారు. జోష్ హెజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ తలో రెండు వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement