Sunday, April 28, 2024

AP: ఏపీలో ఆధార్ అథెంటికేషన్ ద్వారా జీఎస్టీ తక్షణ రిజిస్ట్రేషన్.. నిర్మలా సీతారామన్

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జి ఎస్ టి తక్షణ రిజిస్ట్రేషన్ ను ఆధార్ అథెంటికేషన్ ద్వారా చేసుకునే అవకాశాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తిరుపతిలోని ప్రసార భారతి సమీపంలో రూ.36.11కోట్ల వ్యయంతో ఆరు అంతస్తులతో నిర్మించనున్న తిరుపతి సీజీఎస్టీ కమిషనరేట్‌ కార్యాలయ భవన నిర్మాణానికి ఈరోజు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆమె ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… తిరుపతి చాలా పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశమని, తిరుమల వేంకటేశ్వరుడు ఏడుకొండల వాడు కొలువైన ప్రాంతమని, నేడు తిరుపతి సిజిఎస్టీ కమిషనరేట్ (జీఎస్టీ భవన్) కు భూమిపూజ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

ఈ నూతన భవనం నిర్మితం అయితే ఏడాదికి 63 లక్షల రూపాయలు ఆదా అవుతుందన్నారు. తిరుపతి సిజీఎస్టీ కమిషనరేట్ పరిధిలో తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్య సాయి, కడప అన్నమయ్య జిల్లాలు ఉన్నాయని, సుమారు 57,173 జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు ఉన్నారని తెలిపారు. గత సంవత్సరం ఒక్క జీఎస్టీ టాక్స్ కలెక్షన్లలో రూ. 8264 కోట్లుగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి రూ.5019 కోట్లు వసూళ్లు చేశారని, గత సంవత్సరాలను గమనిస్తే ఇది మూడు వందల శాతంగా వృద్ధి ఉందని తెలిపారు. దీనికి ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్యాసింజర్ వాహనాల తయారీ పరిశ్రమలు, ఆటోమోటివ్ బ్యాటరీ పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు ప్రధానంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని తెలిపారు. శ్రీసిటీ పరిశ్రమల కాంట్రిబ్యూషన్ కూడా ఒక ముఖ్య కారణం అని పేర్కొన్నారు. కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఆధార్ అథెంటికేషన్ ద్వారా జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇన్స్తెంట్ గా చేసుకునే వీలుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కేంద్రం నుండి మంజూరు అయిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిటిజన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు చేసుకోవాలని, ఆ సెంటర్లలో సూక్ష్మ మధ్య తరగతి పరిశ్రమలు, చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్న వారు వారి డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఇన్స్టెంట్ గా 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ పొందవచ్చునని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఆధార్ బేస్డ్ అతెంటికేషన్ సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర రెవెన్యూ సెక్రెటరీ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ… నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి అండగా ఉండాలని, పన్ను ఎగవేత చేసే వారిపట్ల కటినంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో దొరికిన దోషులపై ఇన్వెస్టిగేషన్ వేగవంతం, ప్రాసిక్యూషన్ చేయాలని సూచించారు. సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలు పరిశీలిస్తే 54 నూతన భవనాల ప్రతిపాదనలకు 2200 కోట్లు మంజూరు అయిందని, 9 ప్రతిపాదనలకు స్టాఫ్ క్వార్టర్స్, వాటి నవీకరణకు చెందినవి రూ. 640 కోట్లు మంజూరు జరిగిందనీ అవి వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. నూతన కార్యాలయాల భవనాలు, సిబ్బంది, అధికారుల నివాస క్వార్టర్ లు ఏర్పాటు కోసం, ట్రైనింగ్ సెంటర్ల కోసం పెద్ద ఎత్తున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులు కేటాయించి ఎంతో నిబద్ధత చాటుకున్నారనీ, భవన నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

నూతనంగా నిర్మించనున్న తిరుపతి సిజీఎస్టీ కమిషనరేట్ ఆడియో విజువల్ ఏవి ని ప్రదర్శన తిలకించారు. అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద నేషనల్ అకాడెమీ ఆఫ్ కస్టమ్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్ భవనం పూర్తి స్థాయిలో అయినదని తెలిపారు. ఏడిజి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ రేంజ్ శిశిర్ భన్సాల్ మాట్లాడుతూ త్వరలోనే వెంకటేశ్వర స్వామి నెలకొన్న తిరుపతి జిల్లాలో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని దైవత్వం ఉట్టి పడేలా అన్ని వసతులతో నిర్మాణం చేపడతామని తెలిపారు. వైజాగ్ జోన్ చీఫ్ కమిషనర్ సిజిఎస్టీ సంజయ్ పంత్ మాట్లాడుతూ.. ఇక్కడ నిర్మించనున్న సెంట్రల్ GST కమిషనరేట్ కార్యాలయం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనీ, పన్ను చెల్లింపుదారుల అనుభవాన్ని మెరుగు పరచనున్నదని అన్నారు.


ఇక్కడ నిర్మించనున్న సెంట్రల్ GST కమిషనరేట్ కార్యాలయం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనీ, పన్ను చెల్లింపుదారుల అనుభవాన్ని మెరుగు పరచనున్నదన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో పాల్గొనగా, సి బి ఐ సి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ సంబంధిత అధికారులతో, సి బి ఐ సి సభ్యులతో కలిసి శంఖుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. సీబీఐసి జోనల్ సభ్యులు వివేక్ నిరంజన్ తో పాటు సిజీఎస్టీ, సిబిఐసి సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వాణిజ్య, పరిశ్రమల సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారులు, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement