Thursday, May 2, 2024

చెన్నై ఒలింపియాడ్‌కు చైనా దూరం

భారత్‌ ఆతిథ్యమిస్తున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌కు చైనా దూరమైంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న చెన్నై ఒలింపియాడ్‌కు చైనా క్రీడాకారులెవరూ పాల్గొనడం లేదని, ఈమేరకు సమాచారం వచ్చిందని ఒలింపియాడ్‌ టోర్నమెంట్‌ డైరెక్టర్‌ భరత్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ఏ కారణాలతో రావడం లేదన్న విషయం తెలియరాలేదన్నారు. 2014 ట్రోమ్సో (నార్వే), 2018 బటుమి (జార్జియా) చెస్‌ ఒలింపియాడ్‌ల్లో చైనీస్‌ క్రీడాకారులు గోల్డ్‌తో పాటు సిల్వర్‌, రజత పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

ప్రపంచ చాంపియన్‌గా గుర్తింపు పొందిన చైనీస్‌ ఉమెన్స్‌ టీమ్‌ ఆరుసార్లు ఒలింపియాడ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించగా, నాలుగేసి సార్లు వెండి, రజత పతకాలు చేజిక్కించుకుంది. ఇక పోతే, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో రష్యా, బెలారస్‌ జట్లపై అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఎఫ్‌ఐడీఈ) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత చెస్‌ క్రీడాకారులు చెన్నై ఒలింపియాడ్‌లో టైటిల్స్‌ సాధించే అవకాశాలున్నాయని చెస్‌ క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement