Thursday, April 18, 2024

రంజీ ట్రోఫీ ఫైనల్ పట్టు బిగించిన మధ్యప్రదేశ్‌.. తొలి ఇన్నింగ్స్‌ 536

రంజీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లోనే పైచేయి సాధించింది. 536 పరుగుల భారీ స్కోరు చేసింది. పాటిదార్‌ 67, శ్రీవాత్సవ 11 పరుగులతో నాల్గవ రోజు ఆట ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ జట్టు అదే దూకుడు కొనసాగించింది. రాజత్‌ పటిదార్‌ (122) సెంచరీతో కదంతొక్కాడు. ఇప్పటికే ఓపెనర్‌ యశ్‌ దూబే (133), శుభమ్‌ శర్మ (116) సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ బ్యాట్స్‌మెన్లు ముగ్గురు సెంచరీలు నమోదు చేయడం అరుదైన రికార్డు. శరాన్షు జైన్‌ (57) అర్దసెంచరీతో రాణించాడు. దీంతో మధ్యప్రదేశ్‌ 536 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ముంబై బౌలర్లలో శామ్స్‌ ములాని 5 కీలక వికెట్లు పడగొట్టగా, తుషార్‌ దేశ్‌పాండే 3, మోహిత్‌ అవస్థీ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఓపెనర్లు పృథ్వీ షా(44), హార్దిక్‌ టమోరె(25) పరుగులతో జట్టుకు శుభారంభాన్ని అందించారు.

అయితే అదే ఊపును కొనసాగించలేకపోయారు. కార్తికేయ బౌలింగ్‌లో హార్దిక్‌ టమోరె క్లీన్‌బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరగా, గౌరవ్‌యాదవ్‌ బౌలింగ్‌లో ఓ బంతిని బౌండరీకి తరలిస్తూ దూబేకు క్యాచ్‌ ఇచ్చి కెప్టెన్‌ పృథ్వీ షా వెనుదిరిగాడు. దీంతో 83 పరుగులకే రెండు వికెట్లు ముంబై జారవిడుచుకుంది. అనంతరం బరిలోకి దిగిన అర్మాన్‌ జాఫర్‌ క్రీజులోకి వచ్చిరాగానే బంతిని బౌండరీకి తరలించాడు. అతడికి సువేద్‌ పార్కర్‌ జతకలిశాడు. ఇద్దరూ సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరు బోర్డును పరుగులెత్తించారు. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఇంకా 49 పరుగులు వెనకబడిపోయారు. అర్మాన్‌ జాఫర్‌ 30, సువేద్‌ పార్కర్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement