Saturday, May 4, 2024

BWF | వ‌ర‌ల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్ జట్టును ప్రకటించిన బీఏఐ

ఈ ఏడాది సెప్టెంబరు 25 నుండి USAలోని స్పోకేన్‌లో జరగనున్న BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్ కోసం భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (BAI) పదహారు మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. గ‌త నెల (జూలై) 26 నుంచి 29 వరకు న్యూఢిల్లీలో జరిగిన ట్రయల్ ప్రక్రియ తర్వాత ఈ జట్టును ఎంపిక చేశారు. ఇక USAలో జరగనున్న BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్ టోర్న‌మెంట్ లో.. భార‌త్ త‌రపున‌ ఆయుష్ శెట్టి, ఉన్నతి హుడా నాయకత్వం వహించ‌నున్నారు.

ఒడిశా ఓపెన్, 2022 ఛాంపియన్ ఉన్నతి హుడా బాలికల సింగిల్స్ విభాగానికి BWF ప్రపంచ ర్యాంక్ ప్లేయర్, తారా షాతో పాటు, దేవికా సిహాగ్‌తో పాటు నాయకత్వం వహిస్తారు.

అలాగే, రెండుసార్లు U19 ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ ఛాంపియన్ ఆయుష్ శెట్టి సెలక్షన్ ట్రయల్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. బాలుర జట్టుకు నాయకత్వం వహించ‌నున్నాడు. ఆయనతో పాటు తుషార్ సువీర్, లోకేష్ రెడ్డి కూడా ఉన్నారు.

- Advertisement -

బాలుర డబుల్స్ జట్టులో భారత జూనియర్ నంబర్ 1 నికోలస్ నాథన్ రాజ్-తుషార్ సువీర్, దివ్యమ్ అరోరా-మయాంక్ రాణా ఉన్నారు. ఇక, బాలికల డబుల్స్ విభాగంలో రాధికా శర్మ-తన్వీ శర్మ, వెన్నల కె-శ్రీయాన్షి వలిశెట్టి ఉన్నారు. సమరవీర్-రాధిక శర్మ, సాథ్విక్ రెడ్డి కె-వైష్ణవి ఖడ్కేకర్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాలెంజ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

BWF ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లు మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లతో సెప్టెంబర్ 25న ప్రారంభమవుతాయి. వ్యక్తిగత ఈవెంట్ అక్టోబర్ 2న ప్రారంభమవుతుంది.

భారత జూనియర్ బ్యాడ్మింటన్ స్క్వాడ్ (టీమ్ ఈవెంట్)

బాలుర సింగిల్స్: ఆయుష్ శెట్టి, తుషార్ సువీర్, లోకేష్ రెడ్డి, నికోలస్ నాథన్ రాజ్

బాలికల సింగిల్స్: ఉన్నతి హుడా, తారా షా, దేవికా సిహాగ్, శ్రీయాన్షి వలిశెట్టి

బాలుర డబుల్స్: నికోలస్ నాథన్ రాజ్/తుషార్ సువీర్, దివ్యమ్ అరోరా/మయాంక్ అరోరా

బాలికల డబుల్స్: రాధిక శర్మ/తన్వీ శర్మ, వెన్నల కె/శ్రియాంషి వలిశెట్టి

మిక్స్‌డ్ డబుల్స్: సమరవీర్/రాధిక శర్మ, సాథ్విక్ రెడ్డి కె/వైష్ణవి ఖడ్కేకర్

భారత జూనియర్ బ్యాడ్మింటన్ స్క్వాడ్ (వ్యక్తిగత ఈవెంట్)

బాలుర సింగిల్స్: ఆయుష్ శెట్టి, తుషార్ సువీర్, లోకేష్ రెడ్డి

బాలికల సింగిల్స్: ఉన్నతి హుడా, తారా షా, దేవిక సిహాగ్

బాలుర డబుల్స్: నికోలస్ నాథన్ రాజ్/తుషార్ సువీర్, దివ్యమ్ అరోరా/మయాంక్ అరోరా

బాలికల డబుల్స్: రాధిక శర్మ/తన్వీ శర్మ, వెన్నల కె/శ్రియాంషి వలిశెట్టి

మిక్స్‌డ్ డబుల్స్: సమరవీర్/రాధిక శర్మ, సాథ్విక్ రెడ్డి కె/వైష్ణవి ఖడ్కేకర్

Advertisement

తాజా వార్తలు

Advertisement