హైదరాబాద్, (ప్రభన్యూస్) : భారతదేశంలోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్, వండర్లా హాలిడేస్ లిమిటెడ్, తన హైదరాబాద్ పార్క్ 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఏప్రిల్‌లో పుట్టినరోజు జరుపుకునే వారు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వండర్‌లా హైదరాబాద్‌ను సందర్శించినప్పుడు బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను పొందవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే అమలు ఉంటుంది.
ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ చిట్టిలపిల్లి మాట్లాడుతూ… హైదరాబాద్ పార్క్ ప్రారంభించి ఈ ఏప్రిల్‌కు ఆరేళ్లయిందన్నారు. అందుకే ఈ ఏప్రిల్ నెలకు మన హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇది 6 ఏళ్ల అద్భుతమైన సాహసమన్నారు. ఏళ్ల తరబడి మద్దతు ఇస్తున్న తమ వినియోగదారులందరికీ కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..