Monday, December 9, 2024

Hot Comments – మోడీ పాలన అవినీతిమయం …. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

400 సీట్లు వస్తాయని మోడీ ధీమాతో ఉన్నారు కానీ.. ఆయనను గద్దె దించడానికి ఇండియా మొత్తం ఎదురు చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ పాలన అవినీతిమయంగా సాగిందని ఆరోపించారు. ఏపీ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులుగా ఈసీ ఉన్నతాధికారులను మార్చింది కానీ.. కింది స్థాయిలో మొత్తం వైసీపీ సామ్రాజ్యమే ఉందని వెల్లడించారు.

ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుంటే జగన్, చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోవడం బాధ్యతా రాహిత్యమని ఆరోపించారు. ఈసారి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఈసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది కూడా ప్రధాని మోడీయే నిర్ణయిస్తారని కామెంట్​ చేశారు. జగన్ అయినా, చంద్రబాబు అయినా ఆయన దయతోనే సీఎం కావాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement