Friday, June 14, 2024

Machrla – ఆ పోలింగ్ కేంద్రం సిబ్బందిపై వేటు…. అంద‌రూ బాధ్యులేన‌న్న ఈసీ

ఏపీలోని మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీఓ సహా ఇతర సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది. మాచర్ల 202వ‌ పోలింగ్ స్టేషన్‌లో జరిగిన ఘటన దృష్ట్యా పోలింగ్ సిబ్బంది మొత్తాన్ని ఈసీ సస్పెండ్ చేసింది. ఘటన సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్‌లో అడుగు పెట్టిన సమయంలో అక్కడ ఉన్న పీఓ, ఇతర సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేశారు. ఈవీఎం పగల కొడుతున్న సమయంలో వ్యతిరేకించలేదు. ఈ అభియోగాలపై వారిని ఈసీ సస్పెండ్ చేసింది. రేపటి లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటనపై పీఓ సరైన సమాధానం ఇవ్వలేదని ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement