Saturday, April 27, 2024

బీసీలు గర్వించేలా ఆత్మగౌరవ భవనాలు.. మంత్రులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదవ, కురుమ సంఘ ఆత్మగౌరవ భవనాలను మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. వేల కోట్ల విలువైన కోకాపేటలో 10 ఎకరాల్లో 10 కోట్లతో రెండు భవనాల నిర్మాణం కొన‌సాగుతున్నాయి. రెండు అంతస్తుల్లో అన్ని సదుపాయాలతో భవనాల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయ‌న్నారు. మార్చ్ 10వ తేదీన ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రుల ఆదేశించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల్ని బిసి ఆత్మగౌరవ సముదాయాలకు త్వరితగతిన ఏర్పాటుచేయాలన్నారు. బీసీలు గ‌ర్వించేలా భ‌వ‌నాలు ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంత్రుల‌తోపాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు నిర్మాణాల‌ను ప‌రిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement