Sunday, May 19, 2024

బసిల్‌ రాజపక్సేకు చేదు అనుభవం.. విదేశాలకు వెళ్లకుండా ఆపిన విమానాశ్రయ సిబ్బంది..

అధ్యక్షుడు గొటబయ రాజపక్సే సోదరుడు, మాజీ మంత్రి బసిల్‌ రాజపక్సేకు కొలంబో విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురయింది. శ్రీలంక నుంచి విదేశాలకు వెళ్లేందుకు మాజీమంత్రి బసిల్‌ రాజపక్సే మంగళవారం తెల్లవారుజామున కొలంబోలోని ప్రధాన విమానాశ్రయానికి వచ్చారు. బసిల్‌ రాజపక్సేను ఎయిర్‌పోర్టులో చూసిన వెంటనే ప్రధాన గేటు వద్ద నుంచి ప్రయాణీకులు ఆందోళన ప్రారంభించారు. రాజపక్సేను దేశం విడిచి వెళ్లనీయ వద్దని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

ఎయిర్‌పోర్టులో ప్రవేశించిన బసిల్‌ రాజపక్సేను విమానం ఎక్కకుండా విమానశ్రయ ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది అడ్డగించారు. దేశం క్లిష్ల పరిస్థితుల్లో ఉన్నందున రాజపక్సే విదేశాలకు వెళ్లడం సరికాదని ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది అన్నారు. రాజపక్సేను విదేశాలకు వెళ్లకుండా అడ్డగించినట్లు శ్రీలంక ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఎమిగ్రేషన్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. దీంతో, రాజపక్సే వెనక్కు వెళ్లి పోయారు. రాజపక్సే కొలంబో ఎయిర్‌పోర్టుకు రావడం, ప్రయాణీకుల ఆందోళన, విమానాశ్రయ సిబ్బంది సహాయ నిరాకరణ, ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది అడ్డుకున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement