Thursday, May 2, 2024

అందరికీ రైతుబంధు.. ఇప్పటి దాకా 63.86లక్షల మందికి సాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు సాయం వరంగా మారిందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 63.86 లక్షల మందికి రైతుబంధు సాయంగా రూ.6764.94 కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. తద్వారా ఇప్పటి వరకు కోటి 35 లక్షల ఎకరాలకు సాయం అందిందని పేర్కొన్నారు. మొత్తం రైతులందరికీ సాయందించేలా రైతుబంధు నిధుల పంపిణీ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో డబీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానాలు చెప్పరా? అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ ప్రశ్నలతో బీజేపీలో ప్రకంపనలు చెలరేగాయన్నారు. అన్నింటా విఫలమైన మోడీ ఏం చెప్పాలో తెలీయక మీడియా మొహం చూడడం లేదని ఎద్దేవా చేశారు. గత ఎనిమిదేళ్లుగా ప్రధాని మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? అని నిలదీశారు. చేసిన అభివృద్ధి.. పెట్టిన పథకాల గురించి మాట్లాడమంటే.. అవి వదిలేసి బీజేపీ నేతలు అన్నీ మాట్లాడుతున్నారన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో మోడీ వెనకబడేశారని, అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆరోపించారు. మభ్యపెట్టే రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు సమాధానం చెప్తారని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఎనిమిదేళ్లలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ మోడల్‌ దేశానికి అవసరమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement