Saturday, April 27, 2024

క్యామెడీ,డ్రామా మూవీ భువ‌న విజ‌యం.. టీజర్

సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం భూవన విజయమ్‌. యలమంద చరణ్‌ దర్శకత్వంలో కిరణ్‌, విఎస్కే నిర్మిసు న్నారు. కామెడీ డ్రామాగా భువన విజ యమ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు.
తాజాగా ఈ చిత్రం టీ-జర్‌ని దర్శ కుడు మారుతి విడుదల చేశారు. టీ-జర్‌ ఒక ఆసక్తికరమైన వాయిస్‌ ఓవర్‌తో మొదలైంది. ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు.. ఒక ప్రొడ్యూస ర్‌.. తనకి జాతకాల పిచ్చి.. ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. సచ్చికూడా ఇంకా మనసుల మధ్య తిరుగుతున్న ఓ ఆత్మ.. చావుబతుకుల మధ్య వున్న కూతురుని బ్రతికించు కోవడానికి ఓ తండ్రిపడే వేదన.. పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు, నాలుగు గోడల మధ్య.. మూడు గంటల కాలంలో ఇద్దరు చావాలి, ఒక కథ తేలాలి’ అంటూ సాగిన వాయిస్‌ ఓవర్‌.. ఒకొక్క పాత్ర పరిచయం, ఆసక్తిని రేపే సన్నివేశాలతో టీ-జర్‌ ఆసక్తికరంగా సాగింది. సాయి సినిమాటోగ్రఫీ , ఇంకా ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్‌ తిరందాసు, జబర్దస్త్‌ రాఘవ, అనంత్‌ , సోనియా చౌదరి, స్నేహల్‌ కామత్‌, షేకింగ్‌ శేషు, సత్తి పండు ఇతర నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement