Sunday, April 28, 2024

IPL | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ల‌క్నో, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 43వ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రెండు జ‌ట్లు 8 మ్యాచ్ లు ఆడ‌గా.. ల‌క్నో 5 మ్యాచ్ లు గెలిచి మూడు ఓడిపోగా.. ఆర్సీబీ నాలుగు మ్యాచ్ లు గెలిచి నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది.. దీంతో పాయింట్స్ టేబుల్ లో ల‌క్నో టీమ్ రెండ‌వ స్థ‌నంలో ఉండ‌గా.. బెంగ‌ళూరు 6వ స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement