Monday, April 29, 2024

సుకుమార్ తో ప్ర‌భాస్ మూవీ..

తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న హీరోలు పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌. వీరిద్దరు క్షణం తీరికలేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు షూటింగ్స్‌ చేస్తుండగానే వారు నటించే కొత్త సినిమాల ప్రకటనలు వెలువ డుతున్నాయి. తాజాగా ప్రభాస్‌ గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమంటే సుకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తారని. ఇలాంటి కాంబినేషన్‌ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ‘పుష్ప 2’ చిత్రీకరణలో సుకుమార్‌ బిజీగా ఉన్నారు. ఆయన శిష్యులు దర్శకులుగా మారుతున్న నేపథ్యంలో వారికి తన సహాయసహకారాలు అందిస్తున్నారు. ఇక ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ పూర్తిచేశారు. ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కే’, ‘రాజా డీలక్స్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత సందీప్‌ రెడ్డి వంగాతో స్పిరిట్‌ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత అన్నీ కుదిరితే సుకుమార్‌ కాంబినేషన్‌ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు సైతం అంటున్నాయి. సుకుమార్‌ సృష్టించే హీరోల పాత్రలు ప్రభాస్‌కు బావుంటాయని ఆయన సన్నిహితులు సైతం అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement