Monday, April 29, 2024

ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న “సీతా రామం”

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సీతా రామం మళ్లీ వార్తల్లో నిలిచింది. మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన జంటగా నటించిన ఈ సోల్ ఫుల్ రొమాంటిక్ మూవీని టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి తెర‌కెక్కించాడు. కాగా, ఈ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే 13వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం – జ్యూరీ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికైంది. ఈ కార్యక్రమం నిన్న రాత్రి న్యూఢిల్లీలో జరిగింది.

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిషించారు. సీతా రామం సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement