Wednesday, May 8, 2024

నేడు సిరిసిల్లాలో బ‌ల‌గం ప్రీ రిలీజ్ వేడుక – చీఫ్ గెస్ట్ గా కెటిఆర్..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బలగం గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేటి సాయంత్రం నిర్వ‌హించ‌నున్నారు.. ఈ వేడుక‌లో ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. కాగా, 1997 లో సిరిసిల్ల మార్కెట్ లో కూరగాయలు అమ్మిన వేణు వెల్దండి తెలుగు పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’తో కమెడియన్ వేణు గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అలా జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కమెడియన్ ‘వేణు’. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని బలగం మూవీతో దర్శకుడిగా మారాడు.
. వేణు స్వస్థలం సిరిసిల్ల. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాజన్నసిరిసిల్లజిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో జరిగింది. బలగం సినిమాలో దాదాపు 200 మంది గ్రామస్థులు కనిపిస్తారు. అలాగే, బలగం సినిమా లో ఆర్టిఫిషియల్ తెలంగాణ యాస కాకుండా నాచ్యురల్ తెలంగాణ యాస చూడవచ్చు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ శిరీష సమర్పణలో హర్షిత్‌రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించగా, ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement